Aug 24,2023 00:03

పెదకూరపాడు: జగనన్న కాలనీ లేఔట్లలో మౌలిక వసతుల కల్పనకు సత్వర చర్యలు తీసుకోవాలని సిబ్బందిని జిల్లా కలెక్టర్‌ శివ శంకర్‌ ఆదేశించారు. బుధవారం మండలంలోని బలుసు పాడులో జగనన్న లేఅవుట్‌ను ఆయన పరిశీలించారు. గృహ నిర్మాణ శాఖ అధికారులు, మిగతా శాఖల అధికారులను సమన్వయ పరుచుకోవాలని అన్నారు. కాలనీలో విద్యుత్తు పనులు, తాగునీటి వస తులపై జరుగుతున్న పనులను కలెక్టర్‌ పరిశీలించి, సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. కార్య క్రమంలో గృహ నిర్మాణ శాఖ డిఇఇ వెంకటేశ్వరావు,మండల స్పెషల్‌ ఆఫీసర్‌ ధనలక్ష్మి, తహశీల్దార్‌ క్షమారాణి, మండల అభివృధ్ది అధికారి నర సింహారావు పాల్గొన్నారు.


క్విజ్‌ పోటీలు నిర్వహించాలి

విద్యార్థులకు క్విజ్‌ పోటీలు, విద్యార్థులకు గ్రూపు చర్చలు నిర్వ హించాలని ఉపాధ్యాయులకు కలెక్టర్‌ శివ శం కర్‌ సూచించారు. మండలం లోని తాళ్లూరు జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో బుధవారం పదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. విద్యార్థులను పలు ప్రశ్నలు వేశారు. అనం తరం పాఠశాలలోని ల్యాబ్‌ ను ఆయన పరి శీలించారు. కలె క్టర్‌ వెంట మండల విద్యాశాఖ అధికారులు ప్రసాదరావు, సత్యనారాయణ, ఇన్‌ఛార్జి ప్రధానోపాధ్యాయులు సుబ్బా రావు, పాఠశాల కమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌ రెడ్డి పాల్గొన్నారు.


అంగన్వాడీలకు నూతన యూనిఫాం పంపిణీ
మండలంలోని తాళ్లూరులో అంగన్వాడీ కార్యకర్తలకు నూతన యూని ఫాంను కలెక్టర్‌ శివశంకర్‌ పంపిణీ చేశారు. వచ్చే నెల నుండి అంగన్వాడీ టీచర్లకు కొత్త యూనిఫామ్‌ను ప్రభుత్వం రూపొందించింది. ఆ యూనిఫాంనే వారు ధరిం చాల్సి ఉంటుంది. కార్యక్రమంలో సిడిపిఒ స్వర్ణకుమారి, సూపర్‌వైజర్‌ మున్ని పాల్గొన్నారు.