Aug 11,2023 21:44

శిలాఫలకాన్ని ఆవిష్కరిస్తున్న స్పీకర్‌ సీతారాం

* శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - బూర్జ : 
ప్రతి గ్రామంలో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని రామన్నపేటలో సుమారు రూ.35 లక్షలతో మర్రిపాడులో సుమారు రూ.23 లక్షలతో, కొత్తలక్కుపురంలో సుమారు రూ.24 లక్షలతో, పాలవలసలో సుమారు రూ.66 లక్షలతో జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను సర్వమత గ్రంథాలుగా భావించిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి పాలనపై ప్రజల్లో విశ్వసనీయత చెక్కు చెదరలేదన్నారు. నాలుగేళ్లుగా దేశానికే రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా రాష్ట్రంలో పాలన సాగుతోందని చెప్పారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత, పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని తెలిపారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కర్నేన దీప, జెడ్‌పిటిసి బెజ్జిపురపు రామారావు, టిడ్కో రాష్ట్ర డైరెక్టర్‌ ఖండాపు గోవిందరావు, వైస్‌ ఎంపిపిలు బుడుమూరు సూర్యారావు, కరణం కృష్ణంనాయుడు, పిఎసిఎస్‌ అధ్యక్షులు బగాది నారాయణమూర్తి, మార్కెట్‌ కమిటీ మాజీ అధ్యక్షులు గుమ్మడి రాంబాబు, డిసిసిబి డైరెక్టర్‌ జల్లు బలరాం నాయుడు తదితరులు పాల్గొన్నారు.