Jul 27,2023 23:16

ప్రారంభిస్తున్న స్పీకర్‌ సీతారాం

- శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం
ప్రజాశక్తి - సరుబుజ్జిలి: 
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నట్లు శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అన్నారు. మండలంలోని షలంత్రిలో సుమారు రూ.21.31 లక్షలతో, సుమారు రూ.40 లక్షలతో సచివాలయాన్ని, సరుబుజ్జిలిలో సుమారు రూ.22.40 లక్షలతో జల జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ మంచినీటి కుళాయిలను గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా సిఎం జగన్‌ పాలిస్తున్నారని కొనియాడారు. కుల, మత, ప్రాంతీయ విభేదాలకు తావులేకుండా అవినీతి రహిత పారదర్శకంగా సంక్షేమ కార్యక్రమాలు అమలవుతున్నాయని చెప్పారు. గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థ దేశానికే తలమానికంగా నిలిచిందన్నారు. కార్యక్రమంలో ఎంపిపి కె.వి.జి సత్యనారాయణ, జెడ్‌పిటిసి సురవరపు నాగేశ్వరరావు, వైసిపి మండల అధ్యక్షులు, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బెవర మల్లేశ్వరరావు, మండల సచివాలయాల కోఆర్డినేటర్‌ రవికాంత్‌, బిసి సెల్‌ డైరెక్టర్‌ ఎం.రమణ, మండల మహిళా అధ్యక్షులు బొడ్డేపల్లి చామంతమ్మ, పిఎసిఎస్‌ అధ్యక్షులు కె.చంద్రశేఖర్‌, బొడ్డేపల్లి హరి తదితరులు పాల్గొన్నారు.