Nov 08,2023 23:45

మాట్లాడుతున్న రెవెన్యూ మంత్రి ప్రసాదరావు

* మాట్లాడుతున్న మంత్రి ప్రసాదరావు
శ్రీకాకుళం అర్బన్‌ :
ప్రభుత్వ విద్యారంగాన్ని మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చిత్త శుద్ధితో పనిచేస్తుందని, అందులో భాగంగా పాఠశాలలకు మౌలిక వసతులను కల్పించి విద్యార్థులకు మంచి విద్యా బోధన అందించేందుకు కృషి చేస్తున్నామని రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు అన్నారు. నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల రూ.1.16 కోట్ల వ్యయంతో నిర్మించిన అదనపు తరగతులను బుధవారం ప్రారం భించారు. అదనపు గదుల నిర్మాణం వేగంగా పూర్తి చేసిన ఏజెన్సీ ప్రతినిధులను అభినందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిఎం జగన్‌ విద్య, వైద్య రంగాలకు సముచిత ప్రాధాన్యత ఇస్తున్నారని అన్నారు. సమగ్ర శిక్షా అభియాన్‌ నిధులతో రూపుదిద్దుకున్న ఈ భవనం ఇక్కడి విద్యార్థులకు వసతి సమస్యలను తీరుస్తుందన్నారు. విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని నాడు-నేడులో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారాయన్నారు. విద్యారంగంలో జిల్లా అధికారులు చేస్తోన్న కృషి అభినందనీయమన్నారు. ఇదే స్ఫూర్తితో పనిచేస్తూ ప్రభుత్వ లక్ష్యాలను నెరవేర్చాలని కోరారు. విద్యతోనే సమాజంలో గౌరవం ఉంటుందన్నా రు. సమగ్ర శిక్షా ఎపిసి డాక్టర్‌ రోణంకి జయప్రకాష్‌, క ళింగ కోమటి కార్పొరేషన్‌ చైర్మన్‌ అంధవరపు సూరి బాబు, హెచ్‌ఎం విజయలక్ష్మి, డెప్యూటీ డిఇఒ పగడాలమ్మ, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.