Apr 19,2023 19:50

డ్రెయినేజీ సమస్య చూపుతున్న ప్రజలు

ప్రజాశక్తి - కౌతాళం
మండలంలోని కుంటనహాలు గ్రామంలో మౌలిక సదుపాయాలు కల్పించాలని 'గడపగడపకు మన ప్రభుత్వం'లో ప్రజలు వైసిపి రాష్ట్ర యువ నాయకులు వై.ప్రదీప్‌రెడ్డి దృష్టికి తెచ్చారు. బుధవారం ఆయన ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ఎలా అందుతున్నాయి ప్రజలను అడిగి తెలుసుకున్నారు. వారానికోసారి తాగునీరు వస్తున్నాయని, అనేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు విన్నవించారు. రోడ్డు సమస్యతోపాటు డ్రెయినేజీ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా ఉందని తెలిపారు. ఈ సమస్యలను పరిష్కరించాలని కోరారు. అనంతరం ప్రదీప్‌ రెడ్డి స్పందిస్తూ... హనువాల్‌ వాటర్‌ స్కీం ద్వారా తాగునీటి సరఫరాలో ఇబ్బందులు ఏర్పడుతున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. ఈ సమస్య పరిష్కారం కోసం ప్రత్యేక పైపులైన్‌ కోసం నిధులు మంజూరయ్యాయని తెలిపారు. త్వరలోనే పనులు ప్రారంభించి తాగునీటి సమస్య లేకుండా చేస్తామన్నారు. డ్రెయినేజీ సమస్యను పరిష్కరించాలని అధికారులకు తెలిపారు. అర్హులందరికీ పథకాలు అందించడానికి ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి కృషి చేస్తున్నారన్నారు. గ్రామాభివృద్ధి కోసం ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటామన్నారు. వైసిపి మండల నాయకులు దేశాయి ప్రహ్లాద చారి, ఏకం రెడ్డి, రామన్న గౌడ్‌, చెన్నప్ప, ఎంపిపి అమ్రేష్‌, వైస్‌ ఎంపిపి బుజ్జి స్వామి, శివరాం, బసవన్న గౌడ్‌, మల్లి, సిద్ధ రామ, ఎంపిడిఒ జగన్మోహన్‌ రెడ్డి పాల్గొన్నారు.