Aug 07,2023 21:44

ప్రజాశక్తి - టి.నరసాపురం
    అల్లూరి సీతారామరాజు నగర్‌ వాసులకు మౌలిక సదుపాయాలు కల్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు అనుమోలు మురళి డిమాండ్‌ చేశారు. సోమవారం మండలంలోని ఎఎస్‌ఆర్‌ నగర్‌లో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా మురళి మాట్లాడుతూ కృష్ణాపురం మెట్టలో సర్వే నెంబరు 86లో 2010 నుంచి సుమారు 70 కుటుంబాలకు చెందిన పేదలు గుడిసెలు వేసుకుని నివాసముంటున్నారని తెలిపారు. గ్రామంలో విద్యుత్‌, తాగునీటి సౌకర్యాలు లేక గిరిజనులు, పేదలు నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పలుమార్లు సమస్య పరిష్కారం కోసం అధికారులకు వినతిని అందించామని, అయినా పరిష్కారం కాలేదన్నారు. ఇప్పటికైనా ఉన్నతాదికారులు స్పందించి మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఇళ్లస్తలాల పోరాట కమిటీ సభ్యులు మడకం కుమారి, వగ్గాల లక్ష్మి, బరగడ కుమారి పాల్గొన్నారు.