Jun 20,2023 00:15

వృద్ధులతో మాట్లాడుతున్న బూడి

ప్రజాశక్తి-మాడుగుల:కోట్లాది రూపాయలతో ప్రజల సౌకర్యార్థం మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాల నాయుడు అన్నారు.సోమవారం వీర నారాయణం గ్రామంలో గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేని విధంగా కోట్లాది రూపాయలతో గ్రామ అబివృద్ధి చేస్తున్నామని తెలిపారు. ఇంటింటికీ మంచి నీరు సరఫరా కోసం 97 లక్షలు ఖర్చు చేశామని, జగనన్న ఇళ్ల నిర్మాణానికి 2.65 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. జడ్పీ ఉన్నత పాఠశాల లో 46 లక్షలతో చేపడుతున్న నాడు నేడు పనుల శిలా ఫలకం ఆవిష్కరించారు. మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు నగదు బహుమతి అందించారు. జాతీయ మానసిక వికలాంగ సంస్థ ఆధ్వర్యంలో విభిన్న ప్రతిభావంతులకు బహుమతులు అందించారు. శిరీష అనే విద్యార్థినికి వీల్‌ చైర్‌ అందించారు. ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో నేతలు పాల్గొన్నారు.