ప్రజాశక్తి-హిందూపురం: హిందూపురం పురపాలక సంఘంలో మౌళిక సదుపాయాల కల్పనకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్నట్లు వైసిపి సమన్వయ కర్త దీపిక అన్నారు. గురువారం 15వ వార్డు రహమత్ పురంలో రూ. 12.50లక్షలతో నూతనంగా నిర్మాణం చేస్తున్న మురుగు కాలువ, కల్వర్టు, రోడ్డు పనులను దీపిక ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతు పురపాలక సంఘంలోనే అతి పెద్ద మురుగువాడ రహమత్‌పురం అన్నారు. టిడిపి అధికారంలో ఉన్న సమయంలో వార్డు కౌన్సిలర్ వైసిపి పార్టీ కావడంతో ఇక్కడ కనీస అభివృద్ధి సైతం చేయలేదన్నారు. తాము పార్టీలకు అతీతంగా అన్ని వార్డులకు సమానంగా నిధులను కేటాయించి మౌళిక సదుపాయాలను కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వైస్‌ఛైర్మన్ బలరామిరెడ్డి, వార్డు కౌన్సిలర్ షాజియా, డాక్టర్ బాషా,కౌన్సిలర్లు మల్లికార్జున, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు.










