Dec 10,2022 23:05

ప్రజాశక్తి-కంచికచర్ల 

గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యత క్రమంలో నిధుల కేటాయిస్తున్నట్లు నందిగామ ఎమ్మెల్యే డాక్టర్‌ మొండితోక జగన్మోహన్‌ రావు అన్నారు. కంచికచర్ల మండల పరిషత్‌ నిధులు 60 లక్షల రూపాయల వ్యయం తో స్థానిక వసంత కాలని, హనుమాన్‌ పేట, ఇందిరాకాలని, అరుంధతి కాలనీ, గోకరాజుపల్లి కాలనీల్లో చేపట్టిన సిసి రోడ్డు నిర్మాణ పనులకు శనివారం ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వసంత కాలనీలో నెలకొన్న సమస్యలను పలువురు మహిళలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకు వచ్చారు. స్థానిక సంస్థల నిధులతో, ప్రభుత్వం నిధులు జోడించి గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పూర్తి చేస్తామని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ వేల్పుల ప్రశాంతి, సర్పంచ్‌ వేల్పుల సునీత, ఉప సర్పంచ్‌ వేమా సురేష్‌ బాబు, వైస్‌ ఎంపిపి బండి మల్లిఖార్జన్‌ రావు, యంపిటిసి వేమా రోజా రమణి తదితరులు పాల్గొన్నారు