ప్రజాశక్తి-బాపట్ల: అన్నదాతల అభ్యున్నతికి ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం నిరంతరం కృషి చేస్తుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విద్యాల యం తొలి మహిళా ఉపకులపతి డాక్టర్ ఆర్ శారద జయలక్ష్మి అన్నారు. నూతనంగా ఉపకుల పతి బాధ్యతలు తీసుకున్న శారదా జయలక్ష్మి బుధవారం బాపట్ల వ్యవసాయ కళాశాలను సందర్శించారు. కళాశాలలో వ్యవసాయ విద్యను అభ్యసిస్తున్న హెల్త్ క్లినిక్, నూతనంగా ఏర్పాటు చేసిన రీడింగ్ రూములను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా కళాశాల ఆడిటోరియంలో జరిగిన సభలో ఆమె మాట్లాడారు. రాష్ట్ర విభజన అనంత రం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి కొంతమేర నష్టం జరిగినా తిరిగి శర వేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. ఎంతో చరిత్ర గల బాపట్ల వ్యవసాయ కళాశాలలో వ్యవసాయ విద్యా బోధన, పరిశోధన, విస్తరణ, నైపుణ్యాల ద్వారా ఎందరో విద్యార్థులు అంతర్జాతీయ ఖ్యాతి గడించారన్నారు. ఆ ఖ్యాతిని 75 ఏళ్లుగా కళాశాల నిలబెట్టుకోవడం అభినందనీయమన్నారు. పాదాభి తెలియజేశారు. ప్రభుత్వ సహకారంతో విశ్వవిద్యాలయాన్ని దేశంలోనే ప్రథమ స్థానంలో నిలబెట్టేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తానన్నారు. ప్రధానంగా కళాశాలలో బోధనా సిబ్బంది సంఖ్యను పెంచడం, ప్రయోగశాలల్లో మెరుగైన సౌకర్యాలను కల్పించడానికి కృషి చేస్తానన్నారు. అందుకు అందరి సహకారంతో ఒక ప్రణాళికను తయారు చేస్తామన్నారు. విద్యార్థుల భవిష్యత్తు ఉపాధ్యాయుల వలన మాత్రమే తీర్చిదిద్దబడుతుందని, అందువలన ఉపాధ్యాయులు నైపుణ్యాన్ని పెంచుకుని విద్యా వికాసానికి మరింతగా తోడ్పడాలని అన్నారు. కళాశాలలో మౌలిక వసతుల కల్పనకు అవసరమైన ప్రణాళికలను రూపొందించా లన్నారు. సభలో కళాశాల అసోసియేట్ డీన్ వి శ్రీనివాసరావు మాట్లాడుతూ 1964లో వ్యవసాయ విశ్వవిద్యాలయం స్థాపించిన నాటి నుంచి 15 మంది ఉప కులపతులు సేవలందించారు. అయితే మొట్టమొదటి మహిళా కులపతి శారద జయలక్ష్మిని నియమించడం హర్షణీయమన్నారు. తొలుత కళాశాల విశ్రాంత అధ్యాపక సంఘం బోధన, బోధనేతర సిబ్బంది ఉపకులపతి శారద జయలక్ష్మిని సత్కరించారు. కార్యక్రమంలో డీన్ ఆఫ్ అగ్రికల్చర్ పి సుధాకర్, డీన్ ఆఫ్ స్టూడెంట్ అఫైర్స్ పి సాంబశివరావు, పూర్వ అసోసియేట్ డీన్లు, బోధన, బోధనేతర సిబ్బంది, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. విశ్రాంత ఉపాధ్యాయుల సంఘం, బోధన, బోధనేతర సిబ్బంది, తదితరులు ఆమెను ఘనంగా సత్కరించారు.










