ఎమ్మెల్యే ముత్తంశెట్టి
ప్రజాశక్తి -భీమునిపట్నం : జివిఎంసిలో విలీనమైన గ్రామ పంచాయతీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు స్థానిక ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. సోమవారం నాల్గో వార్డు చిన మంగమారిపేటలో రూ.25 లక్షలతో, జెవి అగ్రహారంలో రూ.16.90లక్షలతో నిర్మించనున్న రోడ్లు, కాల్వల నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా చిన మంగమారిపేట, బోరపేట సభల్లో మాట్లాడుతూ, మత్యకారుల సంక్షేమానికి వైసిపి ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. అర్హులందరికీ ఇళ్లు, ఇళ్ళ స్థలాలు కేటాయింపులో ప్రాధాన్యతనిస్తున్నట్లు వెల్లడించారు. ఎన్టీఆర్ కాలనీలోకొత్త విద్యుత్ సరఫరా లైన్‌ను ప్రారంభించారు. వార్డు కార్పొరేటర్ దౌలపల్లి కొండబాబు అధ్యక్షతన జరిగిన సభలో జోనల్ కమిషనర్ ఎస్ వెంకటరమణ, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్య నారాయణ, పిఎసిఎస్ అధ్యక్షులు అక్కరమాని రామునాయుడు పాల్గొన్నారు.
నాడు నేడు పనులు ప్రారంభం..
రెండో విడత నాడు నేడు నిధులు కోటి 30 లక్షలతో నాలుగో వార్డు మంగమారిపేట, బోరపేట, పాత పరదేశీపాలెం పాఠశాలల అభివృద్ధి పనులను ఎమ్మెల్యే ముత్తంశెట్టి ప్రారంభించారు.










