ప్రజాశక్తి-గాజువాక : గాజువాక నియోజకవర్గంలో మౌలిక సౌకర్యాల కల్పనకు పెద్ద పీట వేస్తున్నామని ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి చెప్పారు. జివిఎంసి 72వ వార్డు పరిధి చైతన్యనగర్‌లో రూ.10 లక్షలతో కాలువలు, సీసీ రోడ్లు నిర్మాణానికి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా నాగిరెడ్డి మాట్లాడుతూ, గాజువాకలోని అన్ని వార్డులలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. 72వ వార్డు సమగ్రాభివృద్ధికి కృషిచేస్తామని తెలిపారు. సంక్షేమంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేస్తున్నామన్నారు. వార్డు కార్పొరేటర్ ఎజె.స్టాలిన్ మాట్లాడుతూ, 72వ వార్డును ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామన్నారు. వైసిపి వార్డు ఇన్‌ఛార్జి సిరట్ల వాసు మాట్లాడుతూ, వార్డు అభివృద్ధికి కృషిచేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో ఇఇ ప్రసాద్‌బాబు, ఎఇ, వార్డు పెద్దలు రాజేంద్రప్రసాద్, మూర్తి, పూర్ణచందర్, సిపిఐ నాయకులు ఎ.విష్ణుమూర్తి, జి.ఆనంద్, వైసిపి నాయకులు రాజాన వెంకటరావు, వాసవి నాయుడు, సాయి, నిర్మల, ధనలక్ష్మి, పిల్లా పద్మ, అప్పారి శ్రీలక్ష్మి పాల్గొన్నారు.










