Nov 11,2023 21:25

జ్యోతి ప్రజ్వలన చేస్తున్న ఎమ్మెల్యే, డిఆర్‌ఒ, చైర్మన్‌ తదితరులు


మౌలానా అబుల్‌ కలాం సేవలు ఎనలేనివి
- ఆయన ఆదర్శాలకు అనుగుణంగా పాఠశాలలు అభివృద్ధి
- ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్‌ రెడ్డి - జిల్లా వ్యాప్తంగా జయంతి వేడుకలు
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్‌

     భారత రత్న మౌలానా అబుల్‌ కలాం విద్యారంగంలో చేసిన సేవలు ఎనలేనివని, ఆయన ఆదర్శాలకు అనుగుణంగా ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చారని ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిశోర్‌ రెడ్డి అన్నారు. శనివారం నంద్యాల పట్టణంలోని ఆర్‌ఏ ఆర్‌ఎస్‌ సెంటినరీ హాల్‌లో మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి, మైనార్టీల సంక్షేమ, జాతీయ విద్యా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. అబుల్‌ కలాం చిత్రపటానికి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మౌలానా అబుల్‌ కలాం ఆజాద్‌ విద్యాశాఖ మంత్రిగా పనిచేసి విద్యారంగానికి చేసిన కృషిని పురస్కరించుకుని జాతీయ విద్యా దినోత్సవాన్ని జరుపుకుంటారని తెలిపారు. స్వాతంత్య్రానంతరం భారతదేశంలో ఆజాద్‌ గ్రామీణ పేదలు, బాలికలకు విద్య, వయోజన అక్షరాస్యత, 14 ఏళ్లలోపు పిల్లలందరికీ ఉచిత, తప్పనిసరి, సార్వత్రిక ప్రాథమిక విద్య, మాధ్యమిక విద్య, వృత్తిపరమైన శిక్షణతో సహా వివిధ రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి విద్యకు పెద్దపీట వేస్తూ విద్యారంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకువచ్చారని తెలిపారు. నంద్యాలలో 18 మున్సిపల్‌ పాఠశాలలను నాడు-నేడు ద్వారా ప్రైవేటుకు దీటుగా అన్ని వసతులు కల్పించినట్లు చెప్పారు. రూ. 470 కోట్లతో మెడికల్‌ కళాశాలను ఏర్పాటు చేయడమే కాకుండా మొదటి సంవత్సరం క్లాసులను కూడా ప్రారంభించినట్లు తెలిపారు. అనంతరం విద్యార్థులకు ఎమ్మెల్యే సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ మాబున్నీసా, ఉర్దూ అకాడమీ మాజీ చైర్మన్‌ డా.నౌమాన్‌, డిఆర్‌ఒ పుల్లయ్య, డిసిహెచ్‌ డా. జఫ్రుల్లా, నంద్యాల మూడవ పట్టణ అధ్యక్షుడు జాకీర్‌ హుస్సేన్‌, కౌన్సిలర్‌ చంద్రశేఖర్‌, ఎంఇఒ బ్రహ్మం నాయక్‌ , సాయిరాం రెడ్డి, విద్యా శాఖ అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆత్మకూర్‌ : అబుల్‌ కలాం ఆజాద్‌ జయంతి వేడుకలను స్థానిక ఏవైఎస్‌ఏ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. యువజన సేవా సంస్థ నాయకులు అన్వర్‌ సాదత్‌, మోమిన్‌ ముస్తఫా, గోల్డ్‌ స్మిత్‌ హిదాయత్‌, వసీం, షబ్బీర్‌, శాలి పైల్వాన్‌, స్వాములు, సలాం, గఫూర్‌, మున్నా, యూసుఫ్‌ తదితరులు పాల్గొన్నారు. నందికొట్కూరు టౌన్‌ : పట్టణంలోని శ్లోక (సిబిఎస్‌ఇ) పాఠశాలలలో కరస్పాండెంట్‌ డాక్టర్‌ జై.శ్రీనివాసరెడ్డి అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళ్లులర్పించారు. పాఠశాల చైర్మన్‌ శ్రీధర్‌ రెడ్డి, డైరెక్టర్స్‌ కవితా, శ్రీదేవి రెడ్డి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. అవాజ్‌ కమిటీ ఆధ్వర్యంలో : ఆవాజ్‌ కమిటీ చైర్మన్‌ అబ్దుల్లా ఆధ్వర్యంలో పట్టణంలోని కాలేజీ రోడ్డులో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మున్సిపల్‌ చైర్మన్‌ దాసి సుధాకర్‌ రెడ్డి విచ్చేసి అబుల్‌ కలామ్‌ ఆజాద్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో పట్టణ జెసిఎస్‌ కన్వీనర్‌ అబుబకర్‌, రహం, వైసిపి నాయకులు అబ్దుల్‌ జబ్బార్‌, ఉస్మాన్‌ బేగ్‌, రజినీ కుమార్‌ రెడ్డి, కిరణ్‌ కుమార్‌ రెడ్డి, ఉస్మాన్‌, రహిమన్‌, హాసం, నంద్యాల జిల్లా శాప్‌ కో- ఆర్డినేటర్‌ రవి కుమార్‌, అవాజ్‌ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. నంద్యాల : మౌలానా అబ్దుల్‌ కలాం ఆజాద్‌ జయంతి సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్‌ పాత్రికేయులు దర్బార్‌ జాకీర్‌, సయ్యద్‌ ముస్తఫాలను సన్మానించారు. పిసిసి ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ చింతల మోహన్‌ రావు, కాంగ్రెస్‌ పార్టీ సేవాదళ్‌ రాష్ట్ర కార్యదర్శి మస్తాన్‌ ఖాన్‌, దాసరి చింతలయ్య, సలీం నగర్‌ రఫీ, జాన్‌జాగో జాతీయ కార్యదర్శి మహబూబ్‌ బాషా, వాసు, రియాజ్‌, బాషా, జాకీరు, ఆనంద్‌ బాబు పాల్గొన్నారు. ఆళ్లగడ్డ : అపుస్మ నంద్యాల డివిజన్‌ అధ్యక్షులు అమీర్‌ భాష ఆధ్వర్యంలో పట్టణంలోని విశ్వశాంతి హై స్కూల్‌లో అధ్యాపకులు విజరు, వెంకటరమణ, పల్లవి, విద్యార్థులు పాల్గొని అబుల్‌ కలాం ఆజాద్‌ చిత్రపటానికి నివాళులర్పించారు. వెలుగోడు : పట్టణంలోని సిపి నగర్‌ ఉర్దూ పాఠశాల ఆవరణలో ప్రజాశక్తి దినపత్రిక ప్రచురించిన స్నేహ పుస్తక ఆవిష్కరణను ఎంపిపి లాలం రమేష్‌, ఎంఇఒ బ్రహ్మం నాయక్‌, పాఠశాల హెచ్‌ఎం నూర్‌ మొహిద్దిన్‌, అవాజ్‌ కమిటీ మహమ్మద్‌ రఫీలు ఆవిష్కరించారు. ఆజాద్‌ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పాఠశాల హెచ్‌ఎం ఉపాధ్యాయులచే విద్యార్థులకు రూ.10 వేలు విలువ చేసే నోట్‌ బుక్‌లను అందజేశారు. విద్యార్థులు వేసిన మహాత్మ గాంధీ ,పండిత్‌ జవహర్‌ లాల్‌ నెహ్రూ ,అబుల్‌ కలాం ఆజాద్‌ వేషధారణలు ఆకట్టుకున్నాయి. ఎంపిపి లాలం రమేష్‌ ముగ్గురు విద్యార్థులకు రూ. 500 చొప్పున, ఆవాజ్‌ కమిటీ నాయకులు మహమ్మద్‌ రఫీ ఒక్కొక్కరికి వంద రూపాయలు చొప్పున బహుకరించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్‌ మెంబర్‌ సులేమాన్‌, మాలిక్‌ అహ్మద్‌, మొహమ్మద్‌ ఇక్బాల్‌, మహమ్మద్‌ రఫీ, నసురుల్లా ఖాన్‌, నూరుల్లా, ఉపాధ్యాయులు అక్బర్‌, జాకీర్‌ హుస్సేన్‌, నజీమున్నిసా, శంషాద్‌, షహనాజ్‌, విద్యార్థులు పాల్గొన్నారు.