మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలి : సిపిఎం
ప్రజాశక్తి - డోన్
రాష్ట్ర విభజన సందర్భంగా పార్లమెంట్ సాక్షిగా ప్రధానమంత్రి చెప్పిన విధంగా డోన్‌లో జాతీయ మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేయాలని సిపిఎం డోన్ పట్టణ, మండల కార్యదర్శులు నక్కి శ్రీకాంత్, కె.నాగరాజులు డిమాండ్ చేశారు. ప్రచార భేరి పాదయాత్ర రెండో రోజు శనివారం సిపిఎం ఆధ్వర్యంలో శ్రీరామనగర్, 23వ వార్డులో నిర్వహించారు. ఇంటింటికి కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. డోన్‌లో మైనింగ్ కళాశాలను ఏర్పాటు చేస్తామని ప్రధాని మోడీ ఇచ్చిన హామీ నేటికీ అమలు చేయలేదన్నారు. తక్షణమే జాతీయ మైనింగ్ కళాశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ మండల కార్యదర్శి నక్కి హరి, ఎస్‌ఎఫ్‌ఐ మండల అధ్యక్షుడు అశోక్, ఐద్వా నాయకు రాలు అమృత, పర్వీన,మాధవి, చరణ్, తదితరులు పాల్గొన్నారు. బనగానపల్లె : బిజెపి ప్రజా వ్యతిరేక నిరంకుశ మతోన్మాద పాలనను గద్దె దింపాలని సిపిఐ మండల కార్యదర్శి సుబ్బారెడ్డి, సీనియర్ నాయకులు సంజీవులు అన్నారు. పట్టణంలో రెండవ రోజు ప్రచార భేరి కార్యక్రమం సిపిఐ నాయకులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో, రాష్ట్రంలో అలుముకుంటున్న చీకట్ల నుండి బయటపడడానికి ప్రజానికమే ఉవ్వెత్తున కదిలి ఉద్యమించాలని పేర్కొన్నారు. మహౌద్యమం నిర్మించడానికి వాపక్ష పార్టీలు ముందుకు వస్తున్నాయని, ప్రజలు తమ వంతు సహకారం అందించాలని కోరారు. పిఎన్‌ఎం జిల్లా కార్యదర్శి శివయ్య, ఏఐటీయూసీ జిల్లా ఆర్గనైగింగ్ కార్యదర్శి శివ బాలకృష్ణ, గిరిజన సమాఖ్య జిల్లా అధ్యక్షులు కాలంగి రాముడు, సిపిఐ నాయకులు శివనాగయ్య, సుబ్బయ్య, కైప కుళ్లాయప్ప తదితరులు పాల్గొన్నారు.
డోన్‌లో కరపత్రాలు పంచుతూ ప్రజల్లో చైతన్యం నింపుతున్న సిపిఎం నాయకులు










