Nov 11,2023 20:51

మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా

మదనపల్లె : భారతదేశ చరిత్రలో మైనార్టీలను అన్నివిధాల తీవ్రంగా మోసం చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డి అని మదనపల్లె మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మెప్మా మహిళలను వేధించి, భయపెట్టి ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించిన ఏకైక ఎమ్మెల్యే నవాజ్‌ బాషా అని పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలన్నారు. సమావేశంలో టిడిపి నాయకులు నవీన్‌ చౌదరి, నాదేళ్ల శివప్రసాద్‌, బాలుస్వామి, సీడ్స్‌ రమణ, నాగూర్‌ వళ్లి,పూలకుంట్ల హరి, నాగమణి, కార్యకర్తలు పాల్గొన్నారు.