Jul 01,2023 22:08

ఫొటో : మాట్లాడుతున్న జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ గడియాల్చి ఎస్థాని

మైనార్టీల సంక్షేమమే సిఎం ధ్యేయం
ప్రజాశక్తి-ఉదయగిరి : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి మైనార్టీల సంక్షేమమే ధ్యేయంగా పని చేస్తూ, మైనార్టీలకు అన్ని విధాలుగా అభివృద్ధి చెందే విధంగా రాష్ట్రంలో మైనారిటీ ఎదుగుదలను ఆకాంక్షిస్తూ వారికి కావాల్సిన అవసరాలను తిర్చడానికి ప్రయత్నిస్తున్నారని జిల్లా వక్ఫ్‌బోర్డు డైరెక్టర్‌ గడియాల్చి ఎస్థాని పేర్కొన్నారు. శనివారం మండల పరిధిలోని వెంగళరావునగర్‌ గ్రామంలోని జామీయ మసీదులో హర్‌ దిల్‌ మే వైఎస్‌ఆర్‌ హమ్‌ సబ్‌ జగన్‌ కే సాత్‌ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి దర్గా, మసీదులను సందర్శించి అక్కడ మౌలిక వసతుల కల్పనపై నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి తెలియపరుస్తానన్నారు.
అందులో భాగంగా మసీదులలో దర్గాలలో ఉన్న సమస్యలను తీర్చడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందని తెలిపారు. ఉదయగిరి నియోజకవర్గ వైసిపి ఇన్‌ఛార్జి మేకపాటి రాజగోపాల్‌ రెడ్డి త్వరలోనే హర్‌ దిల్‌ మే వైఎస్‌ఆర్‌ హమ్‌ సబ్‌ జగన్‌ కే సాత్‌ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో మసీదు పెద్దలు సయ్యద్‌ అబ్దుల్లా, షేక్‌.మహబూబ్‌ సుభాని, షేక్‌.కరీముల్లా పాల్గొన్నారు.