Aug 10,2023 23:24

మైనారిటీ మతస్తులపై దాడులు అమానుషం

వినుకొండ: భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో మైనారిటీ మత స్తులపై దాడులు చేయ డం అమానుషంగా హత్యలు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తు న్నామని సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి ముప్పాళ్ళ నాగేశ్వరావు అన్నారు. గురు వారం నాడు మణిపూర్‌ సంఘటనలకు నిరసనగా వినుకొండలో జరిగిన శాంతి ర్యాలీలో ఆయన పాల్గొని మాట్లాడుతూ మన దేశంలో రాజ్యాంగం ముందు అన్ని మతాలు సమానమేనని, కానీ ఆ రాజ్యాంగాన్ని మన దేశంలో తూట్లు పొడు స్తున్నారని అటువంటి ఈ మతోన్మాద విధానాలు అవలంబిస్తున్న బిజెపి మోడీ అమిత్‌ షా కూటమి దేశానికి పట్టిన చీడ అని పేర్కొంటూ రాజకీయ అధికారాన్ని మార్చడమే నేడు ప్రజల ముందు ఉన్న కర్తవ్యం అని ఆయన పిలుపునిచ్చారు.