ఖాజాను సన్మానిస్తున్న ఫర్టిలైజర్ యజమానులు
ప్రజాశక్తి - ఎమ్మిగనూరు
ఇటీవల ఎమ్మిగనూరు తాలూకా కాంగ్రెస్ మైనారిటీ సెల్ ఛైర్మన్‌గా ఎన్నికైన సిరాలదొడ్డి ఖాజాను ఫర్టిలైజర్ అండ్ సీడ్స్ అసోసియేషన్ అధ్యక్షులు సత్యారెడ్డి, మహేంద్రబాబు, చంద్రశేఖర్ రెడ్డి, మహేష్, గౌడ్, చంద్ర, వెంకటేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో సన్మానించారు. శనివారం పట్టణంలోని రిజిస్ట్రార్ కార్యాలయం వెనుక భాగంలో ఫ్రెండ్స్ ఆగ్రో ఫర్టిలైజర్స్ డిస్ట్రిబ్యూటర్ ప్రాంతంలో ఖాజాకు శాలువా కప్పి పూలమాలలతో సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు చేపట్టాలని ఆకాంక్షించారు. దుకాణ యజమానులు మానసమల్లి, వీరస్వామి, బద్రి, మధు, మంజునాథ్ మల్లి, వీరారెడ్డి, గోపాల్, లింగన్న, ఈరన్న, ఇక్బాల్, వలీ, హనుమంతు, గజేంద్ర పాల్గొన్నారు.










