ప్రజాశక్తి-మైలవరం : గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమం రెండో రోజు అయిన బుధవారం కూడా మైలవరం సచివాలయం 4 పరిధిలో కొనసాగింది. ఈ సందర్భంగా స్థానిక శాసన సభ్యులు వసంత కష్ణ ప్రసాద్ ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను గడపగడపకు వెళ్లి వివరించారు. సర్పంచి మంజు భార్గవి, ఎంపీపీ ప్రసన్న రాణి, ఏఎంసీ చైర్మన్ అప్పిడి సత్య నారాయణ రెడ్డి, జడ్పిటిసి తిరుపతిరావు, వార్డ్ మెంబర్ చిట్టిబాబు పాల్గొన్నారు.










