మైక్రోబయాలజిస్ సదస్సు బ్రౌచర్ ఆవిష్కరణ
ప్రజాశక్తి - క్యాంపస్ : శీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, డిపార్టుమెంట్ ఆఫ్ అప్లైడ్ మైక్రో బయాలజీ అండ్ బయోటెక్నాలజీ సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్ 22- 23,2023 నిర్వహించబోయే అంతర్జాతీయ సదస్సు 'బయోటెక్ మైక్రోన్ : షాపింగ్ ద సస్టైనబుల్ ఫ్యూచర్ '' అనే అంశంపై బ్రౌచర్ ను ఉప కులపతి ఆచార్య డి. భారతి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా విసి ఆచార్య డి.భారతి మాట్లాడుతూ విద్యార్థులు పరిశోధకులు తమకున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఉత్తమమైన సమాచారాన్ని అందించే పరిశోధనలు సమాజానికి అందించేందుకు ఈ అంతర్జాతీయ సదస్సు తోడ్పడు తుందన్నారు. ఇటువంటి అంతర్జాతీయ సదస్సులలో పాల్గొనడం ద్వారా నాణ్యమైన పరిశోధనా పత్రాలు అందిం చడంతోపాటు, పరిశోధన అభివద్ధి మక్కువ, ఆసక్తి పెరుగుతుందన్నారు. కన్వీనర్ కన్వీనర్లు ఆచార్య పి. జ్యోత్స్న, ఆచార్య ఆర్. జయ మాధురిలు మాట్లా డుతూ అంతర్జాతీయ సదస్సుకు పరిశోధన పత్రాలను పంపించేందుకు సువర్ణ అవకాశం ఉందన్నారు. సదస్సు బ్రౌచర్ ను మహిళా వర్సిటీ వెబ్సైట్లోని అందుబాటులో ఉంచారన్నారు. ఈ కార్యక్రమంలో ఆచార్య సువర్ణలతాదేవి,ఆచార్య ఆర్. ఉష, ఆచార్య చండీ కుమారి, ఆచార్య ఎన్.జాన్ సుష్మ, ఆచార్య బి. కిషోరి పాల్గొన్నారు.










