Feb 24,2023 23:42

విద్యార్థులకు మందులు అందజేస్తున్న దృశ్యం

ప్రజాశక్తి-యలమంచిలి రూరల్‌
మండలంలో ములకలపల్లి గ్రామం వద్ద ఉన్న మైహౌమ్‌ ఇండిస్టీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటల నుండి ఏటికొప్పాకలో జిల్లా పరిషత్‌ హైస్కూల్‌ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాక్టరీ వైస్‌ ప్రెసిడెంట్‌ (వర్కింగ్‌) విఎస్‌ .చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న పేద విద్యార్థులకు వైద్య సేవలు అందించాలని సదుద్దేశంతో ఈ ఉచిత మెడికల్‌ క్యాంపు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఈ మెడికల్‌ క్యాంపులో 550 మందికి వైద్య పరీక్షలు, నేత్ర పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ సాంబమూర్తి, ప్రియా, నరేష్‌ కుమార్‌ ఎల్‌ వి ప్రసాద్‌ కంటి వైద్యులు, ప్రధాన ఉపాధ్యాయులు కే గణపతి రావు పాఠశాల విద్యా కమిటీ చైర్మన్‌ ఎం ప్రసాద్‌ పాల్గొన్నారు.