May 16,2023 00:07

బుచ్చయ్యపేట, కోటవురట్లలో కురుస్తున్న పొగ మంచు

ప్రజాశక్తి-నక్కపల్లి:మండలంలోని సోమవారం ఉదయం దట్టమైన పొగ మంచు కురిసింది. ఉదయం 7 గంటల వరకు మంచు కురవడంతో వాహనదారులు రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడ్డారు. పొగ మంచు కురవడంతో రోడ్లు కనిపించలేదు. దీంతో లారీలు, ఇతర వాహనాలు, ద్విచక్ర వాహనదారులు లైట్లు వేసుకుని రాకపోకలు సాగించారు .
బుచ్చయ్యపేట:మండలంలోని దిబ్బిడి, బుచ్చయ్యపేట, చిన్నప్పన్నపాలెం, కందిపూడి రాజంలో పొగ మంచు దట్టంగా కురిసింది. తెల్లవారుజామునుండే ప్రారంభమైన పొగ మంచు ఉదయం 8 గంటల వరకు కురిసింది. అనంతరం ఎండ ప్రారంభమైంది. సాయంత్రం ఐదు గంటల వరకు విపరీతమైన ఊక్క పోతతో ఎండ కాయడంతో ప్రజలు విలవిలు లాడిపోయారు. ఇళ్ల నుంచి బయటికి రావడానికి సైతం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఎండతోపాటు విపరీతంగా ఒక్క పోత ఉండటంతో వృద్ధులు, చిన్నారులు అవస్థలు పడ్డారు.
కోటవురట్ల:మండలంలో మండు వేసవిలో కూడా దట్టమైన మంచు కురిసింది. శీతాకాలాన్ని తలపించడంతో వాతావరణం చల్లబడుతుందని అంతా భావించారు. ఉదయం 8 గంటల నుండి భానుడు తన విశ్వరూపాన్ని చూపాడు.ఉదయం 10:30 గంటలకే రోడ్లన్నీ నిర్మానుస్యంగా మారాయి. వృద్ధులు, చిన్నారులు, చిరు వ్యాపారులు, రైతులు ప్రయాణికులు తీవ్ర అవస్థలు పడ్డారు. మండల పరిషత్‌, తహసిల్దార్‌ కార్యాలయాల వద్ద తాగునీరు ఏర్పాటు చేయాలని పలువురు కోరారు.