
ప్రజాశక్తి - భీమవరం రూరల్
మావుళ్లమ్మను ఆరోగ్య శాఖా మంత్రి విడుదల రజిని బుధవారం దర్శించుకున్నారు. ఆమెకు ఆలయ ప్రధానార్చకులు మద్దిరాల రమణ శర్మ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ సహాయ కమిషనర్ ఇఒ యర్రంశెట్టి శెట్టిభద్రాజీ మంత్రిని సత్కరించారు. అమ్మవారి ప్రతిమతో పాటు, తీర్థ ప్రసాదాలను అందజేశారు.