Dec 06,2022 00:01

,పెదబయలు నడిరోడ్డులో వెలసిన స్థూపం

ప్రజాశక్తి- పెదబయలు : మండల కేంద్రమైన పెదబయలులో సోమవారం రాత్రికిరాత్రే నీలిరంగు జెండాలు చుట్టిన స్థూపం ఒకటి వెలసింది. మావోయిస్టుల పిఎల్‌జిఎ వారోత్సవాలు జరుగుతున్న సందర్భంలో పోలీసులు ముమ్మర గాలింపుచర్యలు చేపడుతున్న పరిస్థితుల్లో ఆదివారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు దీన్ని ఏర్పాటు చేశారు. సోమవారం వారపుసంత కావడంతో తెల్లవారుజామున దీన్ని చూసిన స్థానికులు ఆశ్చర్యపోయారు.
అందిన సమాచారం మేరకు స్థానిక పోలీసులు వెళ్లి దీన్ని పరిశీలించారు. శాంతిస్థూపం పేరిట వెలిసిన దీనిపై మావోయిస్టుల రక్తదాహానికి అసువులు బాసిన గిరిజన సోదరులకు జోహార్లు ఉంది. పోలీసులు, స్థానికులు వెళ్లి స్థూపాన్ని తెరచి పరిశీలించగా అందులో మావోయిస్టుల చేతిలో అత్యంత కిరాతకంగా చంపబడి, వీధినపడ్డ అనేక కుటంబాలకు సంబంధించిన సమాచారం అందులో ఉంది. గిరిజనాభివృద్ధికి ఆటంకం కలిగించే మావోయిజం వద్దని, నరరూప రాక్షసులను ఈ ప్రాంతంలో అడుగుపెట్టనీయ వద్దని అంటూ నినాదాలు ఉన్నాయి.