Nov 23,2022 23:52

స్వాధీనం చేసుకున్న మావోయిస్టు డంపు సామగ్రి ,చూపుతున్న పోలీసులు

ప్రజాశక్తి- సీలేరు : ఏవోబీలోని మల్కన్‌గిరి జిల్లా కటాఫ్‌ ఏరియాలో జొడొంబో పోలీసుస్టేషన్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో గాలింపు చేపడుతున్న పోలీస్‌ బలగాలకు డక్‌పొదర్‌ వద్ద మావోయిస్టు పార్టీ డంప్‌ లభ్యమైంది. ఈ డంప్‌లో భారీ ఎత్తున పేలుడు సామాగ్రి, ఆయుధాలు, మందుపాతరలు ఉన్నట్లు గుర్తించిన ఒడిశా పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డంపును పరిశీలించగా మూడు తుపాకీలు, 18 మందుపాతరలు, గ్రానైట్స్‌, డిటోనేటర్స ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. మావోయిస్టులు విధ్వంసం సృష్టించడానికి ఈ డంప్‌ను దాచిపెట్టినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఎఒబి కటాప్‌ ఏరియాలో ఇంకా ఏమైనా డంపులు ఉన్నాయా? అన్న కోణంలో పోలీసులు గాలింపు చర్యలు చేపడుతున్నారు. ఇటీవల కాలంలో ఆంధ్ర ఒరిస్సా సరిహద్దుల్లో సానుభూతిపరులను వందల సంఖ్యలో ఒడిశా పోలీసులు సరెండర్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. ఏఓబి సరిహద్దులు మావోయిస్టులు కదిలినపై ఒడిశా పోలీసులు నిఘా పెట్టారు.