Oct 21,2022 23:53

పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దళ సభ్యుడు మడివి సోంబడ

ప్రజాశక్తి-మారేడుమిల్లి
మావోయిస్టు పార్టీ కుంట దళ సభ్యుడు మడివి సోంబడ (అలియాస్‌ శంకర్‌) స్థానిక పోలీస్‌ స్టేషన్లో సిఐ అద్దంకి రవికుమార్‌ సమక్షంలో శుక్రవారం లొంగిపోయారు. పోలీస్‌ స్టేషన్లో ఈ వివరాలను సిఐ వెల్లడించారు. సిఐ కథనం ప్రకారం... చత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర సుకుమ జిల్లా, కుంట గ్రామానికి చెందిన మడివి సోంబడ 2013లో మావోయిస్టు పార్టీ దళం పీఎల్‌ 30లో చేరి, కేర్లపలి, జగురుకొండ, కుంట దళంలో ఎల్‌జిఎస్‌గా పని చేశారు. పోలీసులు, మావోయిస్టులకు మధ్య జరిగిన సుమారు 13 ఎదురు కాల్పుల్లో ఆయన పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో మారేడుమిల్లి, గుర్తేడు ఎస్సెలు రాము, జ్వాల సాగర్‌, సిబ్బంది పాల్గొన్నారు.