Aug 10,2023 21:56

కవిటి : మొక్కను నాటుతున్న ఎమ్మెల్సీ రామారావు

ప్రజాశక్తి- కవిటి: మనం ఎన్ని త్యాగాలు చేసినా మాతృభూమి రుణం తీర్చుకోలేనిదని ఎమ్మెల్సీ నర్తు రామారావు అన్నారు. మండలంలోని లండారిపుట్టుగలో ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవ్‌ కార్యక్రమంలో భాగంగా గురువారం నా భూమి-నా దేశం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎందరో త్యాగధనుల నిస్వార్థ కృషి ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్య్రమని అన్నారు. ప్రతిఒక్కరూ తనతమకు తోచిన విధంగా మాతృభూమి సేవలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. అనంతరం మాతృభూమి సేవలో ప్రతిఒక్కరూ పాల్గొంటామని ప్రతిజ్ఞ చేసి, మొక్కలు నాటారు. కార్యక్రమంలో వైసిపి మండల అధ్యక్షుడు కడియాల ప్రకాష్‌, ఎంపిడిఒ సూర్యనారాయణరెడ్డి, కార్యదర్శి మన్మథరావు, ఉపాధి హామీ సిబ్బంది పాల్గొన్నారు.
జి.సిగడాం : మండలంలోని వెలగవాడలో నా మట్టి-నా దేశం ప్రారంభోత్సవంలో మండల పరిషత్‌ ప్రత్యేక ఆహ్వానితుడు మీసాల వెంకటరమణ, సర్పంచ్‌ బొళ్ల జనార్థనరావు, కార్యదర్శి చేబ్రోలు సురేష్‌, ఇసి గేదెల పురుషోత్తం, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
పలాస : స్వతంత్ర సమరయోధులను స్మరించుకోవాలని ఎంపిడిఒ ఎన్‌.రమేష్‌నాయుడు అన్నారు. మండలంలోని ఈదురపల్లిలో మన భూమి- మన దేశం కార్యక్రమంలో భాగంగా ఆజాదిక అమృత్‌ మహౌత్సవ వేడుకల్లో భాగంగా స్వతంత్ర సమరయోధులకు గురవారం ఘనంగా నివాళ్లర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశాన్ని బ్రిటీషు పాలన నుంచి విముక్తి చేసి దేశానికి స్వాతంత్య్రం తెచ్చి పెట్టిన స్వతంత్ర సమరయోధుల వీర చరిత్రను ప్రతిఒక్కరూ తెలుసుకోవాలన్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీర సైనికులకు నివాళ్లర్పించడమే మన భూమి-మన దేశం కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ బోడసింగి ధనుంజయరావు, పంచాయతీ విస్తరణ అధికారి మెట్ట వైకుంఠరావు, ఎన్‌ఆర్‌ఇజిఎస్‌ ఎపిఒ శంకరరావు, పంచాయతీ కార్యదర్శి ఫాల్గుణరావు పాల్గొన్నారు.
సంతబొమ్మాళి : మండలంలోని గోవిందపురం పంచాయతీ పంగజగ్గుపేటలో నాభూమి-నాదేశం, 'నేల తల్లికి నమస్కారం-వీరులకు వందనం కార్యక్రమాన్ని సర్పంచ్‌ రెయ్యి రామిరెడ్డి ప్రారంభించారు. అనంతరం మొక్కలను నాటారు. కార్యక్రమంలో ఎంపిడిఒ సిహెచ్‌.ప్రమీల, మాజీ సర్పంచ్‌ మండపాక నర్సింగరావు, కార్యదర్శి ఎస్‌.ఢిల్లేశ్వరరావు, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ ఆర్‌.వీరన్న పాల్గొన్నారు.