Nov 09,2022 21:39

ప్రజాశక్తి - బుట్టాయగూడెం
             మాతృభాష విద్యా వాలంటీర్లకు రెండు నెలల గౌరవ వేతనం బకాయిలను చెల్లించి, వారిని రెన్యువల్‌ చేయాలని ఎపి వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బుధవారం స్థానిక ఆదివాసీ విజ్ఞాన కేంద్రంలో మాతృభాష విద్యా వాలంటీర్లకు రెండు రోజుల శిక్షణా తరగతులను ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ తరగతులకు విద్యావాలంటీర్ల సంఘం జిల్లా అధ్యక్షులు కుంజా నవీన్‌, కార్యదర్శి కురసం పృధ్విరాజు ప్రిన్సిపల్‌గా వ్యవహరించారు. తొలిరోజు 'గిరిజన సంస్కృతి, సంప్రదాయాలు' అంశంపై అవగాహన కల్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ మాతృభాషలో గిరిజన బాల్యానికి విద్యా బోధన చేసిన విద్యావాలంటీర్లకు రెండు నెలల వేతనాలు విడుదల చేయాలనీ డిమాండ్‌ చేశారు. విద్యాసంవత్సరం ప్రారంభమై ఐదు నెలలు గడుస్తున్నా నేటికీ వారిని రెన్యువల్‌ చేయకపోవడం బాధాకరమన్నారు. గిరిజన సంస్కృతి, ఆచారవ్యవహారాలు విభిన్నమైనవన్నారు. గిరిజనులకు పోడు సాగు చేసుకోవడం, వేటతో తమ గుంపులను పోషించుకునేవారని గుర్తు చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఇటీవల ప్రభుత్వం గుర్తించిన పర్యాటక కేంద్రాలను అభివృద్ధి చేయాలన్నారు. స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షులు తెల్లం రామకృష్ణ, విద్యావాలంటీర్లు సరియం రామసీత, సరియం భవాని, మొడియం స్వాతి, మడకం సీతామహాలక్ష్మీ, కరక వెంకటలక్ష్మి, ధర్ముల రాధా, పాయం దుర్గాప్రియాంక, కూరంశెట్టి లక్ష్మీప్రసన్న, కురసం గీతాంజలి, సోదే సుమలత, మేఘన పాల్గొన్నారు.