సాలూరు: మాతృభాష గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని రాజాం ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ పెన్నేటి స్వప్నహైందవి అన్నారు. సాలూరు సాహితీమిత్ర బృందం ఆధ్వర్యాన పట్టణంలోని పెన్షనర్ల సంఘం కార్యాలయంలో నిర్వహించిన 85వ సాహితీ సభలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సంస్కృత భాష -ప్రయోజనాలు అన్న అంశంపై మాట్లాడారు. సంస్కృత భాష గొప్పతనాన్ని ఆమె వివరించారు. మాతృ భాష గౌరవాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. సాహితీ మిత్ర బృందం గౌరవాధ్యక్షులు జర్జాపు ఈశ్వరరావు మాట్లాడుతూ తెలుగు భాష మాధుర్యాన్ని వెలకట్టలేమన్నారు. డాక్టర్ స్వప్న హైందవి చేసిన సాహిత్య సేవకు గుర్తింపుగా సాలూరు సాహితీ మిత్రబృందం ఆమెను వేగావతీ భారతి బిరుదు తో సత్కరించారు. కార్యక్రమంలో వాసవీ క్లబ్ అధ్యక్షులు ఉప్పల గీత, సాహితీ మిత్రబృందం వ్యవస్థాపక అధ్యక్షులు జెబి తిరుమలాచార్యులు, కోశాధికారి గొట్టాపు శ్రీనివాసరావు మాట్లాడారు.










