Jul 12,2023 21:47

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచఒ జగన్నాధరావు

పార్వతీపురం రూరల్‌ : జూన్‌ నుండి ఇప్పటి వరకు జిల్లాలో సంభవించిన మాతృ మరణాలపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్‌ బి.జగన్నాథరావు అధ్యక్షతన వైద్యాధికారులు, సిబ్బందితో స్థానిక జిల్లా ఆరోగ్య కార్యాలయంలో బుధవారం సబ్‌ కమిటీ సమీక్ష నిర్వహించారు. సాలూరు, జియ్యమ్మవలస, మక్కువ, కురుపాం మండలాల్లో జరిగిన మాతృ మరణాలపై నిర్వహించిన సమీక్షలో అందుకు గల కారణాలను విశ్లేషించారు. ఆశా, అంగన్వాడీ, ఎఎన్‌ఎం, సూపర్‌వైజర్‌, వైద్యుల ఆరోగ్య తనిఖీ వివరాలు, పరీక్షలు, పర్యవేక్షణ, ఏఏ ఆసుపత్రులకు రిఫర్‌ చేశారు, ఏ విధమైన ప్రమాదకర సూచికలు గుర్తించబడ్డాయి, తదితర అంశాలను పరిశీలించి అందుబాటులో ఉన్న వైద్య సేవలు ఎంత వరకు వినియోగించడం జరిగిందని ఆరా తీశారు. కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్‌ బి.వాగ్దేవి, కమిటీ నోడల్‌ అధికారి డిఐఒ డాక్టర్‌ టి.జగన్మోహనరావు, ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ వినోద్‌, డిప్యూటీ డిఎంహెచ్‌ఒలు విజయపార్వతి, వెంకటరమణ, పలువువురు వైద్యాధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.