Jun 13,2023 23:38

మాతృ మరణంపై సమీక్ష నిర్వహిస్తున్న డిఎంహెచ్‌ఒ జగదీశ్వరరావు

ప్రజాశక్తి-సీతమ్మధార : మాతృ మరణాలు లేకుండా పిహెచ్‌సి వైద్యాధికారులు దృష్టి సారించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి పి.జగదీశ్వరరావు చెప్పారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయ సమావేశ మందిరంలో మాతృ మరణాలపై మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో శ్రీకాంత్‌నగర్‌ పట్టణ ఆరోగ్య కేంద్ర పరిధిలో ఒక మాతృ మరణంపై ఆరోగ్య కేంద్రం వైద్యులు, ఎఎన్‌ఎంలతో జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి చర్చించారు. గర్భిణిగా నమోదు అయినప్పటి నుంచి ప్రసవించే వరకు, ప్రసవానంతర సేవలు సక్రమంగా అందేలా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో డిఐఒ డాక్టర్‌ ఎస్‌.జీవనరాణి, ఐసిడిఎస్‌ పీడీ వెంకటలక్ష్మి, డాక్టర్‌ ఉషా ప్రసాద్‌, గైనకాలజిస్టులు శ్యామల, సువర్ణ, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ శ్రీలక్ష్మి, మహిళ ఆరోగ్య అధికారి బి.ఉమావతి, నాయుడు, బి.జ్యోతి, వి.త్రినాధరావు, ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.