ఉమ్మనీటి కొలనులో
ఊ కొడుతూ విన్న భాష
ఉగ్గుపాలతో
రంగరించబడ్డ భాష
మనసు తెలిసిన భాష
మమత పంచిన భాష
భాషలన్నీ
తనలోనే నింపుకోగల
సహృదయ భాష
చుక్కలెన్నున్నా
జాబిలిని
మించలేవు
సృష్టిలో భాషలెన్నున్నా
అమ్మభాషకు సాటిరావు
మాతృభాష రుచినెరిగి
పరభాషలు నేర్చుకో
మనుగడ సాగించు
మాతృభాషలోనే...
* వేమూరి శ్రీనివాస్, 9912128967