ప్రజాశక్తి-గజపతినగరం : మండలంలోని ముచ్చర్లలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య నిర్వహించారు. ప్రతి కుటుంబాన్ని ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వం ద్వారా వారికి చేకూరిన లబ్ధిని వివరించారు. ప్రజా సంక్షేమ పథకాలు భవిష్యత్తులో కొనసాగాలంటే మళ్లీ జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. కార్యక్రమంలో జెడ్‌పిటిసి గార తవుడు, వైసిపి మండల అధ్యక్షులు బూడి వెంకటరావు, పిఎసిఎస్ అధ్యక్షులు కరణం ఆదినారాయణ, బెల్లాన త్రినాథరావు, మండల సురేష్ తదితరులు పాల్గొన్నారు.
వేపాడ : వైసిపి ప్రభుత్వంతోనే సంక్షేమ పాలన సాధ్యమవుతుందని ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు తెలిపారు. ఆదివారం మండలంలోని బొద్దాం గ్రామంలో గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అందుతున్నదీ, లేనిదీ ఆరాతీశారు. ఆయా కుటుంబాలకు ప్రభుత్వ పథకాల ద్వారా చేకూరిన లబ్ధిని వివరించారు. మరోసారి సిఎంగా జగన్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో ఎంపిపి డి.సత్యవంతుడు, వైసిపి మండల అధ్యక్షులు ఎం.జగ్గుబాబు, సర్పంచ్ ఎర్ర రామలక్ష్మి, ఎంపిటిసి పిల్ల లక్ష్మి, పంచాయతీ కార్యదర్శి పద్మ, సర్పంచ్ ఎన్.వెంకట్రావు, తదితరులు పాల్గొన్నారు.










