జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ప్రభావతి దేవి
ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్: జిల్లా వైద్యఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఒ.ప్రభావతిదేవి ఆధ్వర్యంలో ఢిల్లీ నుంచి సెంట్రల్ పాపులేషన్ రీసెర్చ్ కమిటీ వారు డాక్టర్ శ్రీనివాసరాజు గతవారం రోజులుగా వివిధ జాతీయ కార్యక్రమాలపై జిల్లాలోని జిల్లా ఆస్పత్రి, కమ్యూనిటీ హెల్త్ సెంటర్, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, హెల్త్‌వెల్నెస్ సెంటర్, అంగన్వాడీ సెంటర్ నందు పర్యవేక్షించి డేటా సమీకరించారు. ఈ డేటాను స్టేట్ ప్రోగ్రాం ఇంటిమెంటేషన్ ప్లానింగ్ (పిఐపి)లో క్రోడీకరించారు. తను మానిటర్ చేసిన విషయాలలో ముఖ్యంగా మాత శిశు సమీక్ష పై, గర్భిణీ స్త్రీలకు తప్పనిసరిగా అల్ట్రా స్కానింగ్, టిపా స్కానింగ్ ద్వారా బిడ్డ ఆరోగ్యాన్ని తెలుసుకోవచ్చని తద్వారా గర్భిణీ స్త్రీలకు తగిన సేవలు అందించి మాత శిశు మరణాలను తగ్గించవచ్చని తెలిపారు. మాతాశిశ సంరక్షణ కార్డు నందు అన్ని వివరాలు పూర్తి చేయాలన్నారు. జెఎస్‌వై పేమెంట్స్ 83శాతం మాత్రమే ఉందన్నారు, దీనిని 100శాతం తీసుకురావాలన్నారు. కాన్పులన్నీ ఎక్కువ ప్రైవేట్ హాస్పిటల్‌లో జరుగుతున్నది, అన్ని కాన్పులు ప్రభుత్వ ఆసుపత్రిలో జరిగేలా అవగాహన కల్పించి, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ ద్వారా ఉచిత ట్రాన్స్పోర్ట్ వాడేలా చూడాలన్నారు. ఎన్న్సిడి, సిడి కార్యక్రమం, ప్రతి జాతీయ కార్యక్రమానికి టార్గెట్ పాపులేషన్ తప్పనిసరిగా ప్రతిఒక్కరు తెలుసుకోవాలని తద్వారా సేవలు అందించడానికి సులభమౌతుందని అన్నారు. ప్రతికార్యక్రమాన్ని యాప్‌లో క్వాలిటీ డేటాఅప్డేట్ చేయాలన్నారు. ప్రతి ఆరోగ్య కేంద్రానికి పిఆర్‌ఓ తప్పనిసరి ఉన్నట్లయితే పేషెంట్స్‌ను పెద్ద ఆస్పత్రికి రెఫర్ చేసేటప్పుడు తను అనుసంధానంగా వ్యవహరిస్తారన్నారు. అలాగే రోగుల ఫీడ్ బాక్ తీసుకొని ఉత్తమ సేవలు అందేటట్లు చూడాలన్నారు. డిసిహెచ్‌ఎస్ డాక్టర్ రాజశేఖర్, అడిషనల్ డిఎం హెచ్‌ఓ డాక్టర్ వెంకటప్రసాద్, డిఐఓ రావిరాజు, డాక్టర్ హర్షవర్ధన్, డాక్టర్ సందీప్, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ శిరీష, శ్రీనివాసులు పాల్గొన్నారు.










