Sep 28,2023 00:29

మాతా శిశు మరణాలు తగ్గించాలి : డిఎంహెచ్‌ఒ

మాతా శిశు మరణాలు తగ్గించాలి : డిఎంహెచ్‌ఒ
ప్రజాశక్తి - చిత్తూరు అర్బన్‌
మాతా శిశు మరణాలు తగ్గించేలా ప్రతి సూపర్‌వైజర్‌ బాధ్యతగా వ్యవహరించాలని డాక్టర్‌ ప్రభావతిదేవి అన్నారు. బుధవారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ ప్రభావతి దేవి ఆధ్వర్యంలో ప్రతినెలా జరిగే పిహెచ్సి సూపర్వైజర్ల సమావేశంలో మాట్లాడుతూ ''మాతశిశు మరణాలు నివారణకు'' వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ప్రతి సూపర్వైజర్‌ బాధ్యతతో హై రిస్క్‌ గర్భిణీ స్త్రీలను ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ కాన్పుకు వారం ముందే ప్రభుత్వాసుపత్రి లో చేర్పించాలని ఆదేశించారు.. రక్తహీనతతో ఉన్న గర్భిణీ స్త్రీలను తల్లి బిడ్డ ఎక్స్‌ ప్రెస్‌ 102 ద్వారా దగ్గరలోని పిఎస్సీలకు తరలించి రక్తమార్పిడి, సుక్రోస్‌ ఇంజక్షన్లు ఇప్పించాలన్నారు. తద్వారా సాధారణ కాన్పు అవుతుంది. అలాగే పౌష్టికాహారం తీసుకోవడం, పూర్తి ఐరన్‌ టాబ్లెట్‌ వాడేటట్లు చూచుట. 4 డాక్టర్‌ చెకప్‌ పూర్తి చేయుట, టిపా స్కాన్‌, సాధారణ స్కాన్‌ రెండు పూర్తి చేయించడం, ఏదైనా ఇబ్బందికర పరిస్థితి ఉన్నప్పుడు హయ్యర్‌ హాస్పిటల్‌ కి రిఫర్‌ చేయుట. పుట్టిన బిడ్డకు తల్లిపాలు ఆరు నెలల వరకు ఇచ్చుట, పూర్తివ్యాధి నిరోధక టీకాలు వేయించుట, వీటన్నింటినీ తు''చ ప్రతి సూపర్వైజర్‌ తప్పక పాటిస్తే మాత శిశు మరణాలు ఉండవన్నారు. ప్రభుత్వం ప్రత్యేకంగా చేపట్టిన 'జగనన్న ఆరోగ్య సురక్ష' కార్యక్రమాన్ని నిబద్ధతతో మానిటర్‌ చేస్తూ 30 తారీఖు నుంచి జరగబోయే స్పెషల్‌ మెడికల్‌ క్యాంపుల్ని సక్సెస్‌ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్‌ ఓ జార్జ్‌, హెచ్‌ఈఓ గుణశేఖర్‌, డిపిహెచ్‌ఎన్‌ఓ రేణుక ప్రభ, జిల్లాలోని వివిధ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నుంచి సూపర్వైజర్లు పాల్గొన్నారు.