Aug 22,2023 21:44

సమావేశంలో మాట్లాడుతున్న డిఎంహెచ్‌ఒ

ప్రజాశక్తి - పుట్టపర్తి రూరల్‌ : హై రిస్క్‌ గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని ఎక్కడా మాతా శిశు మరణాలు చోటు చేసుకోకుండా తగిన చర్యలు తీసుకోవాలని డిఎంహెచ్‌ఒ ఎస్‌వి కృష్ణారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన మంగళవారం పుట్టపర్తి లోని స్త్రీ శక్తి భవనంలో వ్యాక్సిన్‌ ప్రీవెంటబుల్‌ డీసీజ్‌ (రొటీన్‌ ఇమ్యునైజేషన్‌ ) వ్యాక్సిన్‌ ప్రైవేంటబుల్‌ డీసీజ్‌ చినపుదు, సీరమ్‌ నమూన , థ్రోట్‌ నమూనా తీయు విధానం తదితర వాటిపై ప్రత్యేక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ముఖ్యంగా పిహెచ్‌సి వైద్యాధికారులకు ఫీల్డ్‌ లో జరిగే ఇమ్యు నైజేషన్‌ పైన లోపాలను సరి చేసుకువాలని సూచించారు. గర్భిణులకు అన్ని రకాల పరీక్షలు నిర్వహించి, హైరిస్క్‌ గర్భిణీ స్త్రీల పట్ల ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. ఈ కార్యక్రమములో పిహెచ్‌సి, యుపిహెచ్‌సి, పిపి. యూనిట్‌ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.