Feb 02,2023 00:02

నినాదాలు చేస్తున్న ప్రభావతి, మహిళా నేతలు

ప్రజాశక్తి-ముంచింగిపుట్టు:cమండల కేంద్రంలో బుధవారం ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ప్రభావతి మాట్లాడుతూ, గిరిజన ప్రాంతంలో మహిళలకు రక్షణ లేకుండా పోతుందని, మహిళల చట్టాలు, హక్కులను కాల రాస్తున్నారని విమర్శించారు.ఈ మధ్యకాలంలో పలువురు ప్రముఖులు మహిళలను కించపరిచే విధంగా మాటలు మాట్లాడారని మండిపడ్డారు. మాతా శిశు మరణాలు అమాంతంగా పెరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. మహిళలకు ఉపాధి కల్పించి, మహిళల మనోభావాలను కాపాడాలని కోరారు. ఏజెన్సీలో హైడ్రో పవర్‌ ప్రాజెక్టుల ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కి తీసుకోవాలన్నారు. హైడ్రో పవర్‌ ప్రాజెక్ట్‌లతో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు సీసా విజయలక్ష్మి, మహిళా సంఘం సభ్యురాలు సోనియా ఈశ్వరి, మీనా, దసుధ, ధన, రాధమ్మ తదితరులు పాల్గొన్నారు.