Nov 05,2023 00:18

శిక్షణా కార్యక్రమంలో మాట్లాడుతున్న బి.రవి

పల్నాడు జిల్లా: జిల్లాలో మాతా శిశు మరణాల నివారణకు వైద్య ఆరోగ్య శాఖాధికారులు కృషి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి బి.రవి అన్నారు. స్థానిక పల్నాడు రోడ్డులోని ఏరియా హాస్పిటల్‌ లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్‌ బి రవి ఆధ్వర్యంలో శనివారం జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల మెడికల్‌ ఆఫీసర్‌ లకు, సామాజిక ఆరోగ్య కేంద్రాలు, ఏరియా హాస్పిటల్‌ లోని గైనకాలజిస్టులకు శిక్షణ ఇచ్చారు. జిల్లాస్థాయిలో హై రిస్క్‌ ప్రెగెన్సీపై ఇంటి గ్రేటెడ్‌ హై రిస్క్‌ ప్రెగెన్సీ మేనేజ్మెంట్‌ అండ్‌ ట్రాకింగ్‌ శిక్షణా కార్యక్రమంలో భాగంగా దీనిని నిర్వహిం చారు. ఈ సందర్భంగా డిఎంహెచ్‌ఒ మాట్లా డుతూ గతంలో మృతి చెందిన గర్భిణుల ఆరోగ్య పరి స్థితికి సంబంధించిన నివేదికలు పరిశీలించి, ప్రమాద కర పరిస్థితులను ముందుగానే అంచనా వేయాలని, క్షేత్రస్థాయి నుంచి రిఫరల్‌ చేసి ప్రత్యేక వైద్య సేవలు అందేలా కృషి చేయాలన్నారు. గర్భిణుల ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా తెలుసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్మాన్‌ సంస్థ మెడికల్‌ ట్రైనింగ్‌ ఆఫీసర్‌ డాక్టర్‌ నితీష, డాక్టర్‌ సుష్మ, గైనకాలజిస్ట్‌, డాక్టర్‌ ప్రియాంక, డిప్యూటీ డిఎంహెచ్‌ డాక్టర్‌ జి.చంద్రశేఖర్‌, డాక్టర్‌ నాగ పద్మజ, బి సురేఖ ,స్త్రీల ప్రసూతి వైద్య నిపుణులు పాల్గొన్నారు.