ప్రజాశక్తి -పెద్దకడబూరు
మాట ఇస్తే తప్పని వ్యక్తి ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని మంత్రాలయం ఎమ్మెల్యే వై.బాలనాగిరెడ్డి తెలిపారు. శుక్రవారం పెద్దకడబూరులో 'ఎపికి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. షాదీఖానా భవనంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి హాజరయ్యారు. ముందుగా స్థానిక ఎస్సీ కాలనీ నుంచి బస్టాండ్ వరకు వైసిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పురుషోత్తం రెడ్డి, మండల కన్వీనర్ రామ్మోహన్ రెడ్డి, రాష్ట్ర రోడ్డు డెవలప్‌మెంట్ ఛైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు వివిధ గ్రామాల సర్పంచుల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే బాలనాగరెడ్డి చేతులమీదుగా జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. వైసిపి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలుకు అందించిన సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి మరోసారి జగన్‌ను ఆశీర్వదించాలని కోరారు. జడ్‌పిటిసి జాము రాజేశ్వరి, మాజీ ఎంపిపి రఘురాం, జెసిఎస్ కన్వీనర్ రవిచంద్ర రెడ్డి, ఎంపిడిఒ ప్రభాకర్, సర్పంచి రామాంజనేయులు, కోసిగి మార్కెట్ యార్డు మాజీ వైస్ ఛైర్మన్ ముక్కరన్న, కోసిగి మార్కెట్ యార్డు వైస్ ఛైర్మన్ బొగ్గుల అర్లప్ప పాల్గొన్నారు. మంత్రాలయంలోని సచివాలయం-2 పరిధిలో 'ఎపి జగనే ఎందుకు కావాలి' నిర్వహించారు. అందుకు ముందు రాఘవేంద్ర సర్కిల్‌లో వైసిపి జెండాను వైసిపి మండలాధ్యక్షులు భీమిరెడ్డి, ఇన్‌ఛార్జీ విశ్వనాథ్ రెడ్డి ఆవిష్కరించారు. సర్పంచి తెల్లబండ్ల భీమయ్య, ఉప సర్పంచి హోటల్ పరమేష్ స్వామి, ఎంపిటిసి జి.వెంకటేష్, ఎంపిపి పి.రాఘవేంద్ర, వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున, మాజీ సర్పంచి గోర్కల్ కృష్ణస్వామి, నాయకులు శివకుమార్, బొంబాయి శివ, వీరయ్య శెట్టి, దామోదర్ గుప్తా, కోల్గేట్ రమేష్ పాల్గొన్నారు.