కడప ప్రతినిధి : కడప నగరానికి చెందిన గౌతమి సంఘమిత్రకు మాస్టర్ ఆఫ్ లాలో గోల్డ్ మెడల్ లబించింది. అనంతపురం శ్రీకష్ణదేవరాయ యూనివర్సిటీ సోమవారం నిర్వ హించిన కాన్వగేషన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ గోల్డ్ మెడల్ అంద జేశారు. సంఘమిత్ర తండ్రి సంపత్ కుమార్ కడప నగరంలో ప్రముఖ న్యాయవాదిగా 35 సంవత్సరాలు పని చేయడమే కాకుండా అభ్యుదయ వాదిగా పలు సేవలందిస్తున్నారు. ఆమె తల్లి మనోరమ ఉపాధ్యా యురాలిగా పనిచేస్తున్నారు. గోల్డ్ మెడల పొందిన గౌతమి సంఘమిత్ర మాట్లాడుతూ నాన్న ఆదర్శంగా క్రిమినల్ లా చేసేందుకు ఎస్‌కెయూలో సీటు పొందానని తెలిపారు .ఇక్కడ ప్రొఫెసర్లు శ్రీరాములు, పుల్లారెడ్డి ప్రోత్సాహంతో బాగా చదివి మంచి మార్కులు సాధించి గోల్డ్ మెడల్‌కు ఎంపిక అయ్యానని పేర్కొన్నారు. ప్రస్తుతం కడపకోర్టు బార్‌లో క్రిమినల్ లాయర్ గా పనిచేస్తున్నారని తెలిపారు. గౌతమి సంఘమిత్ర మాస్టర్ లా లో గోల్డ్ మెడల్ సాధించడం పట్ల ఆమె తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు.










