Jul 14,2023 00:00

మాట్లాడుతున్న భాగ్యలక్ష్మి

ప్రజాశక్తి-పాడేరు:గిరిజన ప్రాంతంలో మారుమూల పల్లెలకు కూడా మెరుగైన వైద్య సేవలు విస్తరించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి తెలిపారు. చింతపల్లి మండలంలోని మారుమూల ప్రాంతమైన కోరుకొండ గ్రామంలో రూ.90 లక్షలతో నిర్మించిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని పాడేరు ఐటిడిఎ పీఒ అభిషేక్‌తో కలిసి గురువారం ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లా డుతూ, గిరిజనుల ఆర్థికాభివృద్ధి, సంక్షేమం కోసం ప్రభుత్వం నిరంతరం ఆలోచన చేస్తూనే ఉందన్నారు. మారుమూల పల్లెల్లో ఉన్న ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు, వైద్య సేవలు, ఉత్తమ విద్య అందించాలన్నదే సీఎం జగన్మోహన్‌ రెడ్డి లక్ష్యమని పేర్కొన్నారు. పేదవారెవరూ వైద్యం అందలేదనో, సరైన విద్య లభించలేదనో బాధపడకూడదని జగన్మోహన్‌ రెడ్డి నిత్యం చెబుతూ ఉంటారన్నారు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో ఒకపక్క సంక్షేమానికి, మరోపక్క అభివృద్ధికి సమ ప్రాధాన్యమిస్తుందన్నారు. హాస్పిటల్స్‌, పాఠశాలలు నిర్మించడం, పాతవాటిలో మౌలిక వసతులు సదుపాయం కల్పించడం వంటివి ఈ నాలుగేళ్లుగా నిరంతరాయంగా చేపడు తున్నామని తెలిపారు. అయినా ప్రతిపక్షాలు ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి పెట్టడం లేదని విమర్శిచడం భావ్యం కాదన్నారు. జగన్మోహన్‌ రెడ్డి అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజలంతా మద్దతిస్తున్నారన్న ఉద్దేశంతోనే ప్రతిపక్షాలు లేని పోని ఆరోపణలు చేస్తున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ కొర్ర రమేష్‌, వైస్‌ సర్పంచ్‌ కామరాజు, ఎంపీటీసీ బచ్చల మచ్చమ్మ, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్‌, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జికే వీధి ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు మోరి రవి, సచివాలయం కన్వీనర్‌ మోహన్‌, మండల కన్వీనర్‌ పాంగి గుణబాబు, ఎంపీటీసీలు మీనా కుమారి, మోహనరావు, లోవరాజు, బెన్నవరం సచివాలయ కన్వీనర్‌ బొజ్జన్న దొర, నాయకులు తిరుపతి, సత్యనారాయణ, టి.లోవరాజు, వార్డు మెంబర్లు ఎండ్రిపల్లి కృష్ణ, పాంగి లింగారావు, పాంగి లింగేశ్వరరావు, వెంచర్బా గంగమ్మ, నాయకులు, కార్య కర్తలు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

సంక్షేమ పాలన సీఎం జగన్‌తోనే సాధ్యం
ఎమ్మెల్యే కొట్టగుళ్ళి భాగ్యలక్ష్మి
పాడేరు:రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్‌ జగన్మోహన్‌ రెడ్డి తోనే రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం సాధ్యమ వుతుందని పాడేరు శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి అన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా చింతపల్లి మండలం బలపం పంచాయతీ మారుమూల గ్రామాలు బూరుగు బయలు, తోటల మామిడి గ్రామాలలో పర్యటించారు. స్థానిక సర్పంచ్‌ కొర్ర రమేష్‌ ఆధ్వర్యంలో శాసనసభ్యులు కొట్టగుల్లి భాగ్యలక్ష్మి కి ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో భాగంగా 153 గడపలను సందర్శించారు. గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి నాలుగేళ్లుగా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధిని వివరించారు. అర్హత ఉండి పథకాలు ఎవరికైనా అందకపోతే వెంటనే తెలియజేయాలని భాగ్యలక్ష్మి సూచించారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయన్నారు. ఎన్నికల హామీలు 99 శాతానికి పైగా అమలు చేసిన ఘనత సీఎం జగన్మోహన్‌ రెడ్డికి దక్కుతుందన్నారు. పార్టీలక తీతంగా అర్హులందరికీ పథకాలు అందజేస్తున్నామని, వాలంటీర్‌ వ్యవస్థ ద్వారా ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలు అవుతున్నాయని తెలిపారు. సంక్షేమ పథకాలతో గడిచిన నాలుగేళ్లలో మూడు లక్షల కోట్ల ప్రజల ఖాతాల్లో డిబిటి విధానం ద్వారా జమ చేశారని వెల్లడించారు. సంక్షేమ పాలన చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైస్‌ సర్పంచ్‌ కామరాజు, ఎంపీటీసీ బచ్చల మచ్చమ్మ, జడ్పిటిసి పోతురాజు బాలయ్య పడాల్‌, ఎంపీపీ కోరాబు అనూష దేవి, జికే వీధి ఎంపీపీ బోయిన కుమారి, మండల అధ్యక్షులు మోరి రవి, సచివాలయం కన్వీనర్‌ మోహన్‌, మండల కన్వీనర్‌ పాంగి గుణబాబు, ఎంపీటీసీలు మీనా కుమారి, మోహనరావు, లోవరాజు, బెన్నవరం సచివాలయ కన్వీనర్‌ బొజ్జన్న దొర, నాయకులు తిరుపతి, సత్యనారాయణ, టి లోవరాజు, వార్డు మెంబర్లు ఎండ్రిపల్లి కృష్ణ, పాంగి లింగారావు, పాంగి లింగేశ్వరరావు, వెంచర్బా గంగమ్మ, నాయకులు, కార్యకర్తలు సచివాలయం , సిబ్బంది పాల్గొన్నారు