ధూరి : మార్పు కోసం ఆప్ పార్టీకి ఓటు వేయాలని పంజాబ్ ఓటర్లకు ఆ పార్టీ సిఎం అభ్యర్థి భగవంత్ మాన్ విజ్ఞప్తి చేశారు. భగవంత్‌ను ఆప్ సిఎం అభ్యర్థిగా ఎంపిక చేయడంతో ఆయన బరిలో ఉన్న ధూరి నియోజకవర్గం ఇప్పుడు వార్తల్లో నిలిచింది. కమెడియన్‌గా పేరుపొందిన భగవంత్ 2011లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2014లో ఆప్ పార్టీలో చేరారు. సంగ్రూర్ లోకసభ నియోజకవర్గం నుంచి 2014, 2019ల్లో ఎంపిగా ఎన్నికయ్యారు. తాజాగా ఆయనను సిఎం అభ్యర్థిగా ఆప్ ప్రకటించింది.










