బద్వేలు :పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణ కాండను ఆపాలని ముస్లిమ్ సోదరులు కోరారు. పాలస్తీనా ప్రజలపై ఇజ్రాయిల్ చేస్తున్న మారణ కాండ ఆపాలని డిమాండ్ చేస్తూ స్థానిక మహబూబ్ నగర్ వీధిలో ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ముస్లిమ్ సోదరులు నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కడప జిల్లా ఆవాజ్ కమిటీ జిల్లా అధ్యక్షులు చాంద్ బాషా, బద్వేల్ పట్టణ ఆవాజ్ అధ్యక్షులు సత్తార్ , బద్వేల్ పట్టణ కెవిపిఎస్ అధ్యక్షులు గిలక రాజు, బద్వేల్ పట్టణ డివైఎఫ్‌ఐ కార్యదర్శి నాగార్జున ,బద్వేల్ పట్టణ కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేషన్ నెంబర్ మాబు సాహెబ్, ఫిరోజ్ మాట్లాడుతూ 1945 రెండవ ప్రపంచ యుద్ధంలో జర్మనీ అధ్యక్షుడైన హిట్లర్ 60 లక్షల మంది యూదులను అతి కిరాతకంగా హత్యలు చేయించి వారిని అంతమందించాడని చెప్పారు. కొంతమంది యూదులను ప్రాణబిక్షపెట్టి వదిలేశాడని, మిగిలిన యూదులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ఇతర దేశాల్లో తలదాచుకుని అమెరికా, ఫ్రాన్స్, క్యూబా , కెనడా,తోపాటు ఇతర దేశాలకు ఓడల్లో దేశ సరిహద్దుల్లో వెళ్లారన్నారు. 1947 లో పాలస్తీనా ప్రజలు మానవతా దక్పథంతో ఆ యూదులను తలదాచుకొనుటానికి దేశంలోకి అనుమతించి విశాల హదయంతో వారికి స్థలాలు ,ఇండ్లు, కేటాయించారన్నారు. కతజ్ఞత మరిచిన యూదులు పాలస్తీనా ప్రజల భూములు ఆక్రమించుకొని వారి ఇళ్లను ధ్వంసం చేస్తున్నారని పేర్కొన్నారు. నేడు బాంబులు వేసి పాశవికంగా హత మారుస్తున్నారని, నేడు పాలస్తీని ప్రజలు సర్వం కోల్పోయారని చెప్పారు. ఇప్పటికైనా ఐక్యరాజ్యసమితి జోక్యం చేసుకొని చర్చలు జరిపి ఈ యుద్ధం ఆపాలని కోరారు. కార్యక్రమంలో ముస్లిం నాయకులు నాగూర్, కమల్ బాష , బాదుల్లా ,మౌలాలి, ముస్లిం సహోదరులు పాల్గొన్నారు.










