ప్రజాశక్తి - హోళగుంద
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ సొంత ఖర్చులతో గ్రావెల్ పనులకు శ్రీకారం చుట్టారు. శనివారం మంత్రి సోదరుడు, దేవరగట్టు ఆలయ కమిటీ ఛైర్మన్ గుమ్మనూరు శ్రీనివాసులు మార్లమడిగి రోడ్డు గ్రావెల్ పనులకు భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రోడ్డు అధ్వాన స్థితికి చేరుకోవడం వల్ల కర్ణాటక, ఆంధ్రాకు ప్రయాణం ఇబ్బందిగా మారిందని తెలిపారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారిలో విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తమ దృష్టికి రావడంతో సొంత నిధులు రూ.10 లక్షలతో గ్రావెల్ పనులు ప్రారంభించినట్లు చెప్పారు. ఈ రోడ్డుకు బిటి రోడ్డు వేసేందుకు నిధులు ముంజూరు చేసినప్పటికీ కొన్ని అనివార్య కారణాల వల్ల పనులు కాలేదన్నారు. మండల ప్రజల విజ్ఞప్తి మేరకు తాత్కాలికంగా ఈ రోడ్డుకు గ్రావెల్ వేయడానికి ముందుకొచ్చినట్లు తెలిపారు. ఎన్నికల్లోపు మంత్రి గుమ్మనూరు జయరామ్ సహకారంతో బిటి రోడ్డు వేసేందుకు కృషి చేస్తామన్నారు. వైసిపి మండల కన్వీనర్ షఫీవుల్లా, నాయకులు శేషప్ప, మల్లికార్జున పాల్గొన్నారు.
భూమి పూజ చేస్తున్న నాయకులు










