Sep 19,2023 22:24

విచారణ చేస్తున్న వాణిజ్య పన్నులశాఖ అధికారులు

మక్కువ: మండలంలోని మార్కొండపుట్టి పంచాయతీలో ట్రాన్స్‌కో అధికారులు చేపట్టిన పనులపై ఆ శాఖ ఇఇడిపిఇ (విశాఖపట్నం) (ఆపరేషన్‌) బిఎ రాజశేఖర్‌, విజిలెన్స్‌ బృందం మంగళవారం విచారణ చేపట్టింది. ఈనెల 18న మేనెలలో బిల్లులు... సెప్టెంబర్‌లో పనులు.. అన్న శీర్షికన 'ప్రజాశక్తి'లో ప్రచురితమైన వార్తకు విలువడిన విషయం విధితమే. దీనికి స్పందించిన విజిలెన్స్‌ అధికారులు బృందం విచారణ చేపట్టింది. గ్రామంలో పనులు జరిగిన తీరును ట్రాన్స్‌ఫార్మర్‌ ఎప్పుడు ఏర్పాటు చేశారన్న అంశంపై ప్రజలను అక్కడి సిబ్బందిని విచారించారు. ఈ విచారణలో సిబ్బంది తడబడుతూ సమాధానాలు చెప్పారు. అలాగే స్థానికుల సమాధానాలు వేరుగా ఉండడం గమనార్హం. అక్కడ ట్రాన్స్‌ఫార్మర్‌ పెట్టొద్దని గతంలో వ్యతిరేకించామన్నారు. ఇటీవలే ఎవరికీ తెలియకుండా ఆ ప్రాంతంలో ట్రాన్స్‌ఫార్మర్‌ బిగించారని మాజీ సర్పంచ్‌ తేలు శ్రీరాములు తెలిపారు. అలాగే అదే గ్రామానికి చెందిన ఓ నారాయణ వాంగ్మూలమిస్తూ ఈ ట్రాన్స్‌ఫార్మర్‌ నుంచి విద్యుత్‌ కనెక్షన్‌ ఇటీవల ఇచ్చారన్నారు. అంతకుముందు దిగు ప్రాంతం నుండే విద్యుత్‌ సరఫరా అయ్యేదని తెలిపారు. కొద్ది రోజుల క్రితమే ఇక్కడ అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేశారని ఆయన అన్నారు. అయితే స్థానిక సిబ్బంది ఒకరిపై ఒకరు పొంతన లేని విధంగా సమాధానాలు తెలిపారు. అనంతరం మక్కువ ట్రాన్స్‌కో కార్యాలయం వద్ద గతంలో పనిచేసిన ఎఇ శివశంకర్‌ వద్ద కూడా అధికారులు లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ గతంలో స్థానిక రికార్డులు బొబ్బిలిలో ఉండేవని, ప్రస్తుతం పార్వతీపురం మన్యం జిల్లాకు బదిలీ అయ్యాయన్నారు. వీటిని పరిశీలించే ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామని తెలిపారు. ఈ విచారణలో
తప్పు కప్పిపుచ్చుకునే యత్నం..!
మార్కొండపుట్టిలో విద్యుత్‌ శాఖ చేపట్టిన పనుల తీరుపై పత్రికల్లో వెలువడిన వార్తలకు విజిలెన్స్‌ అధికారులు విచారణకు వస్తున్నారన్న సమాచారంతో విద్యుత్‌ శాఖ సిబ్బంది ముందుగానే గ్రామంలో నానా హైరానా పడ్డారు. ట్రాన్స్‌ ఫార్మర్‌ నుండి ఉదయాన్నే విద్యుత్‌ సరఫరా అందించిన విషయాన్ని బయటకు పొక్కకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. పనులన్నీ గతంలో కొన్ని నెలలు క్రితం జరిపినట్లు తెలిపేలా తాము చేసిన తప్పులను యత్నించారు. కానీ అప్పటికే మీడియా అక్కడికి చేరుకోవడం స్థానికులు కూడా ఇటీవలే ట్రాన్స్‌ఫాÛర్మర్‌ అమర్చినట్లు తెలపడం ఇక్కడ విశేషం.