సీతంపేట: వైటిసిలో నిర్వహిస్తున్న వీడీవీకేల సభ్యుల ఎంటర్ ప్రెన్యూర్ షిప్ మార్కెటింగ్ పై శిక్షణ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని, మార్కెటింగ్‌పై అవగాహన పెంచుకోవాలని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. గురువారం శిక్షణ ముగింపు కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. వీడీవీకేల అభివృద్ధికి ఐటిడిఎ ద్వారా అన్ని విధాలుగా ప్రోత్సహిస్తామని అన్నారు. మహిళలు ఆర్ధికంగా ఎదగాలని అన్నారు. ఈ సంధర్బంగా శిక్షణ తీసుకొన్న అభ్యర్థులకు ధ్రువపత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిడి రమణ, డిపిఎం నారాయణరావు, శిక్షణ సిబ్బంది, వైటీసీ మేనేజర్ వెంకటరమణ, వెలుగు ఎపిఎంలు, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
ఆడలి వ్యూ పాయింటును అభివృద్ధి చేస్తాం
ఆడలి వ్యూ పాయింట్‌ను ప్రముఖ పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని ఐటిడిఎ పిఒ కల్పనకుమారి అన్నారు. ఈ సంధర్బంగా ఆడలి వ్యూ పాయింట్ వద్ద నైట్ క్యాంపింగ్ టెంట్స్, భోజన, వసతి సౌకర్యం కల్పించడానికి ఆసక్తి కలిగిన అభ్యర్థులతో వైటిసిలో పిఒ సమావేశమయ్యారు. ఈ సంధర్బంగా ఆమె మాట్లాడుతూ ఆడలి వ్యూ పాయింట్‌కు వచ్చే పర్యాటకులకు అవసరయ్యే అన్ని సౌకర్యాలను కల్పించాల్సి ఉంటుందన్నారు. దీని కోసం ఆసక్తి గల అభ్యర్థులతో ఒక సొసైటీగా ఏర్పాటు చేస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా పనిచేయాలన్నారు. సొసైటీ ఏర్పాటుకు ఆసక్తి గల అభ్యర్థులు ముందుకు రావాలని కోరారు. ఈ సమావేశంలో ఎపిఒ రోషిరెడ్డి, ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.










