ప్రజాశక్తి - నిజాంపట్నం
స్థానిక మార్కెట్ యార్డు నందు రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణరావు అధ్యక్షతన కూచినపూడి వ్యవసాయ మార్కెట్ యార్డ్ చైర్మన్‌గా పందరబోయిన బసవ పున్నయ్య, వైస్ చైర్మన్‌గా కోలసాని కోటేశ్వరరావును మరియు డైరెక్టర్లను అగ్రికల్చరల్ మార్కెటింగ్ జాయింట్ డైరెక్టర్ కె శ్రీనివాసరావు ప్రమాణ స్వీకారం చేయించారు. ప్రమాణ స్వీకారోత్సవ సభకు రాజ్యసభ సభ్యులు, పిఎంఆర్ సీఫుడ్స్ అధినేత బీధా మస్తాన్‌రావు, మోపిదేవి వెంకటరమణారావు మాట్లాడుతూ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. టిడిపి హయాంలో వ్యవసాయమే దండగని చంద్రబాబు నిర్వీర్యం చేశారని అన్నారు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా వ్యవసాయానికి పెద్దపీట వేశారని అన్నారు. రైతులకు గిట్టుబాటు ధరతో పాటు ఆర్థికంగా రుణాలు ఇచ్చి ఆదుకుంటున్నారని అన్నారు. అనేక సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మేలు చేస్తున్నారని తెలిపారు. చంద్రబాబు తానొస్తే ఏదో చేస్తామని ప్రగల్బాలు పలుకుతున్నాడని అన్నారు. చంద్రబాబుతో తనకు పాతిక సంవత్సరాల అనుబంధం ఉందని, మాటలు తప్ప చంద్రబాబు పనులేమీ చేయరని అన్నారు. పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి కుల, మత, ప్రాంత, పార్టీ తేడాలు లేకుండా అందరికీ మేలు చేస్తున్నాడని అన్నారు. ఓటు అడిగే ధైర్యం, హక్కు జగన్మోహన్‌రెడ్డి మాత్రమే ఉందని అన్నారు. ప్రజలు ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమానికి వైసిపి మండల అధ్యక్షులు వెంకట హరినాథ్ బాబు, జడ్పిటిసి నర్రా సుబ్బయ్య, వాసుదేవా, ఎంపీటీసీలు, సర్పంచులు, వార్డు మెంబర్లు, కార్యకర్తలు పాల్గొన్నారు.










