Sep 10,2022 23:15

షెడ్‌ను ప్రారంభిస్తున్న డిజిఎం బాబూనాయక్‌

ప్రజాశక్తి-ఉక్కునగరం : సెక్టార్‌-5 వీక్లీ మార్కెట్లో వినియోగదారుల కోసం నిర్మించిన షెడ్‌ను టౌన్‌ అడ్మినిస్ట్రేషన్‌ డిజిఎం బాబు నాయక్‌ ప్రారంభించారు. స్టీల్‌ సిఐటియు టౌన్‌ అడ్మిన్‌ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు కార్యదర్శి యు.రామస్వామి మాట్లాడుతూ కొన్నేళ్లుగా వీక్లీ మార్కెట్‌కు షెడ్‌లు లేకపోవడంతో వ్యాపారులతోపాటు వినియోగదారులు ఎండావానలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, దీనిపై సిఐటియు ఆధ్వర్యాన అధికారులకు విన్నవించడంతో స్పందించి షెడ్‌లు ఏర్పాటు చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వీటిల్లో తాగునీరు, మరుగుదొడ్లు, ఇతర మౌలిక సౌకర్యాలను కల్పించి, సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. కార్యక్రమంలో స్టీల్‌ సిఐటియు టౌన్‌ అడ్మిన్‌ కమిటీ నాయకులు రాజేశ్వరరావు, కెఆర్‌కె రాజు, మహేష్‌, గణేష్‌, ప్రభాకర్‌, రాజశేఖర్‌, రామకష్ణ పాల్గొన్నారు.