న్యూఢిల్లీ : మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ మారింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం (ఇసి) ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో ఇసి జారీ చేసిన షెడ్యూల్ ప్రకారం.. ఈనెల 27న తొలి దశ పోలింగ్ జరగాల్సి ఉండగా.. దాన్ని ఈనెల 28కి మారుస్తున్నట్లు తెలిపింది. అలాగే, మార్చి 3న జరగాల్సిన రెండో విడత పోలింగ్‌ను మార్చి 5కు మారుస్తున్నట్లు వెల్లడించింది. ఫిబ్రవరి 27న ఆదివారం క్రైస్తవులు ప్రముఖంగా భావించే 'ఆరాధన దినం' కావడంతో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చాల్సిందిగా క్రిస్టియన్ సంస్థలు, పలు గిరిజన సమూహాలతో పాటు కొన్ని రాజకీయ పార్టీలు కూడా విజ్ఞప్తి చేసినట్లు ఇసి తెలిపింది. మణిపూర్‌లోని మూడు మిలియన్‌ల జనాభాలో క్రిస్టియన్లు 41 శాతంగా ఉన్నారు.










