ప్రజాశక్తి - ఆదోని
పట్టణంలో బెట్టింగ్ మాఫియాను అంతం చేసే వరకైనా ఆదోని త్రీ టౌన్ సిఐగా శ్రీరామ్‌ను కొనసాగించాలని ఆదోని జిల్లా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు ఎ.నూర్ అహ్మద్ డిమాండ్ చేశారు. గురువారం ఆదోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. బెట్టింగ్‌లపై అరెస్టుల పర్వం కొనసాగుతున్న సమయంలో విచారణ చేస్తున్న సిఐ శ్రీరామ్‌ను హఠాత్తుగా విఆర్‌కు పంపడంలో అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఎన్నో కేసులను త్వరగా ఛేదించి బాధితులకు న్యాయం చేసిన నిజాయితీ అధికారి సిఐ శ్రీరామ్ అని కొనియాడారు. కేవలం ఐదు నెలల్లోనే ఆదోని నుంచి దూరం చేయడం ఆదోని పట్టణ ప్రజలు జీర్ణించుకోలేక పోతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉన్నతాధికారులు స్పందించి సిఐ శ్రీరామ్‌ను ఆదోని త్రీ టౌన్ సిఐగా పంపాలని కోరారు. జికె.ఆంజినేయులు, సయ్యద్ వసీమ్, సాహెబ్ పాల్గొన్నారు.
ఎఒ గోవింద్ సింగ్‌కు వినతి పత్రం ఇస్తున్న నాయకులు










